మధురాను భావాల కవిత నువ్వు
మాటని మనస్సుని వేరు చేసే మత్తు నువ్వు కాగితం పై కలంతో వేసే అక్షరాల ఆలోచన నువ్వు
నాకనులు నీకనులకై వెతికే ఆకర్షణ నువ్వు
మనస్సు మనస్సు ల మధ్య ఈ ప్రేమ వైరం నువ్వు
ఆనంద బాష్పాలా ఆత్మ నువ్వు
ఆనందంలో ఉన్న శ్వాస నువ్వు
బాధ లో ఉన్న ఆశ నువ్వు
కనులు మూయగానే వచ్చే తొలి కల నువ్వు
కనులు మూసి తెరిసిన వెన్ వెంటనే వచ్చే తొలి జ్ఞాపకం నువ్వు
అనురాగ విరహ వేదనల మధ్య బాధ నువ్వు.
© రాజశేఖర్ ఎగుర్ల
Comments