ఇండియా గేట్ – ముంబై
కాలంతో నువ్ కరిగిపో,కలగానే నేను కాలం అవుతా అని నా కల నన్ను వెక్కిరిస్తుంది.మనకంటూ ఎన్నో కలలు ఉంటాయి,వాటికి ఒక రూపం ఇవ్వడం చాల సమయం పడుతుంది,మన కల ఒకటి అయినపుడు మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు మనల్ని వెనక్కి నెట్టడం సహజం అయిపోయింది ఈ కాలం లో,ప్రతికూల పరిస్థితులని ఎలా అయిన తట్టుకొని ఎదుర్కొని నాకు నచిన పని చేయాలనీ సంకల్పించుకున్నాను,కాని ఎలా మొదలు పెట్టాలో అస్సలు అర్థం అవ్వట్లే.నేను హైదరాబాద్ వచ్చి ఒక నెల కావస్తుంది,నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తంగా అయిపోవడానికి వచ్చాయి.నాకు జాబ్ చేయాలి అని అంతగా లేదు, ఫోటోగ్రఫీ & ట్రావెల్ అంటే ఇష్టంఎలా ఇంట్లో వాళ్ళకి చెప్పాలో తెలియట్లేఒంటరిగా ప్రయాణించాలి అని నిర్ణయించుకున్న.ఎవరు ఎం అనుకున్న నాకు నచ్చినట్టు చేయాలి అని అనుకున్న,కానీ కాలమే సమాదానం చెప్పాలిచేయాల్సినడానికి .. జరుగుతున్న దానికి .. ఏం సంబందం లేకుండా ఉన్న రోజులువేచి ఉన్న ..! వేచి ఉంటా !
Comments