ఎన్నో చెప్పాలి అనుకుంటూ ఇలా మొదలు పెడుతున్న. కానీ అన్ని చెప్పగలనో లేదో చివర్లో చూస్దాం.
మనకి మనసులో చెప్పాలి అని చెప్పలేక ఎన్నో ఉంటాయి, అటువంటి చెప్పలేని మాటలని ఇక్కడ పదాలుగా పేర్చాలి అని ఎన్నో సార్లు అనుకున్న.
నాకు ఎపుడు ఒక ప్రశ్న నా మనసులో ఉంటూనే ఉంటది. ఏంటి అంటే మనం ఒకరికి ఇచ్చే ప్రత్యేకత మనం ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రత్యేకతను ఎందుకు అంతగా తీసుకోలేక మరొక వ్యక్త్తి కి తాను ప్రత్యేకతను ఇచ్చి తిరిగి వాళ్ళ నుండి పొందాలి అనుకుంటాడు అర్థం కాదు. మీకు అర్థం కాలేదు అనుకుంట మళ్ళీ ఒకసారి తిరిగి క్లుప్తంగా చదవండి . నేను ఒకవ్యక్తి ప్రత్యేకతను ఇస్తున్నప్పుడు ఆ ప్యత్యేకతను పొందే వ్యక్తి కూడా తిరిగి ఇస్తే బాగుండు అని నేను తన లానే ఎదురుచూడటంలోనే తాను ఎంతలా ఆ ప్రత్యేకత కోసం భాధ పడుతున్నారో అర్థం అవుతుంది. అందుకే ఎవరిని మనసుకి దగ్గరగా తీసుకోడం మొదలు పెట్టి వాళ్ళ నుండి కూడా వాళ్ళ లాగ ఎదురుచూడకండి. మనకి ప్రత్యేకత ఇచ్చే వ్యక్తిని మాత్రం మర్చిపోకండి & వాళ్ళకి ఆ ప్రత్యేకతను ఇస్తేనే మీ మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుందని మర్చిపోకండి. వాళ్ళ ప్రేమ ఒకేసారి పెద్ద సోదిలా ఉండచ్చు, కొన్ని సార్లు వాళ్ళ భాధను నీతోనే చెప్పుకోవచ్చు, నీకు అవన్నీ చెప్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో నీకు ఒక మంచి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు అని. అది అర్థం చేసుకోలేని అందరికి ధన్యవాదాలు.
<div brave-ledger-verification="52b28466a56d7486c65e69dc1c3f6401110a32bccb2281359a028daab1e3642c
Comments