మనసులో మెదిలిన భావాలూ ఎన్నో ఉంటాయి! ఆ భావాలకి సరిగా ఉన్న వ్యక్తులు పరిచయం అయినపుడు జీవితం చాల బాగా ఉంటుంది. అలాగే మనషులకి ఉన్న గొప్ప శక్తీ భావం (feeling). అ భావాన్ని వ్యక్తపరిచే విధానం బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు! ఆ విదంగా నేను చూసిన వ్యక్తులు ఎలా ఉంటారు అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను.
ఉన్న భావాలూ ఎన్నో, బయటకి వ్యక్తపరిచే భావాలు ఎన్నో , మన మనిషి అనుకున్నపుడు చెప్పే భావం ఒకటి, లేనపుడు చూపించే భావం ఇంకొకటి, ఈ భిన్న భావాలని విభిన్నంగా వ్యక్తపరిచే వ్యక్తులు ఈ ప్రపంచం లో చాల మంది. అందులో నేను ఉండచ్చు నీ భావన ప్రకారం, అలా ఒకరి భావాలూ ఇంకొకరి భావాలతో ఏకిభవించకపోవచ్చు. ఒకే రకమైన భావాలూ ఉన్న వ్యక్తులు చాల త్వరగా లేదా చాల దగ్గర కలిసిపోతారు, అది ప్రేమగా లేదా స్నేహంగా మారుతుంది. ఎపుడైతే ఇద్దరి మధ్యలో భావా విభేదాలు వస్తాయో అపుడే ప్రేమ తగిపోతుంది ఇక్కడ ప్రేమ అంటే ఇద్దరి మధ్య సంబంధం (స్నేహం). అల నా జీవితం లో నేను అనుభవించా. మనస్సులో ఎన్నో ఆశలు (కోరికలు) మనల్ని ఒకే రకమైన వ్యక్తిగా ఎపుడు ఉంచావు, అల అని భావాలు మారి మనస్సుల మధ్య విభేదాలు ఎపుడు వస్తాయా అంటే మనకి మనమే ఏం చెప్పలేం మన ఎదుటి వారి నుండి కూడా ఉంటాయి. నా జీవితం మర్చిపోలేని స్నేహితులని నేను ఎన్నుకున్న అనుకున్న అని ఇపుడు ఎం చెప్పలేను, కొన్ని సార్లు అనిపిస్తుంది వ్యక్తిగత భావం ముందు ప్రేమలు ఎం ఉండవ్ అని , మరి కొన్ని సార్లు ప్రేమ ముందు వ్యక్తి గత భావం ఏం మిన్న కాదని, ఆలోచనల ఆకలి ఉంటే ఆ ఆలోచనకి జవాబు చూపేది మన వ్యక్తిగత భావమే. ప్రేమ ఎపటికి సమధానం కాదు.ప్రేమ అనేది ఎపుడూ ఎలా పుడుతుందో మనకి తెలిదు కాని భావ విభేదాలు వస్తే మాత్రం ఆ ప్రేమ ఉండదు. కాని మొదట్లో కొత్తగా మొత్తం వాళ్ళే అని ఆహ నిమిషం అనిపిస్తుంది కాని మెల్ల మెల్లగా మొత్తంగా ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకున్నపుడు ఆహ ప్రేమ తర్వాత ఉండదు. ఇలా చెప్పుకోడానికి ఎన్నో ఉంటాయి. అలా అని ఎవరిని తప్పుగా తీస్కోకూడదూ.
Opmerkingen