చిన్నగా కొన్ని రోజుల జీవితాని కల్పితంగా మరియు నిజాలతో గలకలిపి ఇక్కడ అక్షరరూపం లో రాస్తున్నాను..! అర్థం అయిన అవకున్న ఈ విషయం గురించి నాతో ఎవరు చర్చించడానికి ప్రయత్నించవద్దని కోరిక !
ఒకవైపు ఆలోచనలని సైతం గడ్డకట్టిస్తున్న ఆహ చలి లో ఒక వేచ్చని కాఫీ చేతిలో ఆలోచనలకి ఆయువు అయితూ మనస్సులోని బావాలకి పదాలని అందిస్తూ ఒక కవిత రాసా .. !
నింగిలోని చుక్కలన్ని దారి తప్పి నిన్ను చుసేనంటా అన్ని నీకై వేచనంట మళ్లీ మళ్లీ అదే రాత్రి కోసం….. నన్ను నేనే… మరిచనే నీకోసం ఆ తారాల్ల… మనసంతా నీ కోసం ఏదో ఏదో అయిందే నువ్వే నాకంటూ. కొత్త కొత్త దారులన్నీ వెతికానే నీతో స్నేహం కోసం, మళ్లీ మళ్లీ మరవలేను ఆ రోజులింక గుర్తచ్చి నన్నే ఇలా గాయ పరుస్తుంటే.. !
కలలకి కూడా మనసుందేమో అనిపిస్తుంది ఒక్కోకపుడు, కలలు కూడా నా మనాస్సుతో స్నేహం చేయడం మొదలెట్టాయి. రాత్రి కలలు కూడా నిన్ను మరలేకుండా ఉన్న ఆహ జ్ఞాపకాలు చిన్నవే అయిన నాకు మాత్రం ఇపటికి మళ్లీ మళ్ళీ రిపీట్ లో ఉన్నాయ్.
మధురాను భావాల కవిత నువ్వు
మాటని మనస్సుని వేరు చేసే మత్తు నువ్వు
కాగితం పై కలంతో వేసే అక్షరాల ఆలోచన నువ్వు
నాకనులు నీకనులకై వెతికే ఆకర్షణ నువ్వు
ఎవరికీ ఎలా అర్థం అయితే అలానే అనుకోండి ….!
Note :
జీవితం ఒక ప్రయాణం అంటారు , ఒకదాని కోసం పోరాడినపుడు ఇంకొకటి కోల్పోవచ్చు . ఇలా నా జీవితం లో ఎన్నో వచ్చి పోయాయి, నేను తప్పు చేశాను అనిపిస్తేయ్ అర్థం అయిన వాళ్ళు క్షమించండి, ఒప్పు అనిపించినా వాళ్ళు నన్ను గుర్తుంచుకోండి, నాకు తెలిసి ఎవరిని నేను భాద పెట్టలే అని అనుకుంటున్నా కాలం మనకి పరిక్షపెట్టి నపుడు అనుకోకుండా తప్పు చేస్తాం, లేదా ఆహ ఒక్క దాన్ని ఎంపిక చేస్కోడం మనకి ఉన్న చివరిది అయి ఉండచు. ఇలా ఎన్నో మనకి ఈర్ష అసూయ, ఆశలని పుట్టిస్తాయి.
ఇంకా ఉంది ! మిగతా బాగం రాయగానే next పేజి లో పొందుపరుస్తాను!
Comments